AP: మహిళలకు గుడ్ న్యూస్. స్త్రీశక్తి పథకం కింద త్వరలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెడతామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ పథకానికి రూ.95 కోట్లు ఖర్చయిందని చెప్పారు. 60 శాతం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారన్నారు. 6 నెలల్లో కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పల్లెల నుంచి పట్టణాలకు ఏసీ బస్సులు నడపాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి వివరించారు.