టెక్నాలజీ విస్తరణతో స్మార్ట్ పరికరాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్ (ICO), 'విచ్' సంస్థల నివేదికల ప్రకారం కొన్ని స్మార్ట్ టీవీలు, ఎయిర్ ఫ్రయర్లు వినియోగదారుల లొకేషన్, వాయిస్ డేటాను సేకరించి విదేశీ సర్వర్లకు పంపే అవకాశముందని పేర్కొన్నాయి. అలాగే వీక్షణ అలవాట్ల సమాచారాన్ని ప్రకటనల సంస్థలకు పంచే అవకాశమూ ఉందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వాలని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు చేయాలని, పరికరాన్ని విక్రయించే ముందు వ్యక్తిగత డేటాను పూర్తిగా తొలగించాలని ఐసీవో వినియోగదారులకు సూచించింది.