చిన్న వయసులో ధూమపానం.. స్ట్రోక్ ప్రమాదం 80% అధికం!

2075చూసినవారు
చిన్న వయసులో ధూమపానం.. స్ట్రోక్ ప్రమాదం 80% అధికం!
దక్షిణ కొరియాలో 90 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో 20 ఏళ్లలోపు ధూమపానం ప్రారంభించిన వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం 70-80% అధికమని తేలింది. 20 ఏళ్ల తర్వాత ధూమపానం మానేసినా, రక్తనాళాలపై శాశ్వత ప్రభావం వల్ల ప్రమాదం అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారతదేశంలో కూడా ధూమపానం మొదలుపెట్టే వయసు తగ్గి, యువతలో స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని న్యూరాలజిస్టులు పేర్కొంటున్నారు. చిన్న వయసులో ధూమపానం మెదడు, గుండె, రక్తనాళాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్