ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు

657చూసినవారు
ఓటర్ల జాబితాలో స్మృతి ఇరానీ పేరు గల్లంతు
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ పేరు అమేథీ జిల్లాలోని మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా నుంచి గల్లంతైంది. 2024 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ, జూన్ 10వ తేదీన ప్రకటించిన పంచాయతీ ఓటర్ల జాబితాలో కనిపించలేదు. దీనిపై అమేథీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తుందని, వెరిఫికేషన్ అనంతరం పేరు చేరుస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్