భారత లేడీ కోహ్లీ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన ఈ పెళ్లి, ఇప్పుడు మళ్ళీ జరగబోతోందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్మృతి మందాన తండ్రి, పలాష్ చెల్లెలితో కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. స్మృతి తండ్రి, పలాష్ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.