బ్రెజిల్‌లోని అరౌకారియాలో కొందరు కేటుగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడ్డారు. ఓ ట్రక్కు వెనుక బంపర్‌లో ఫోన్ డబ్బాలు పట్టేలా ప్రత్యేకంగా ఇనుప బాక్సులను అమర్చి అందులో సెల్ ఫోన్లు తరలిస్తున్నారు. అయితే బంపర్ వద్ద చేసిన మార్పులను గమనించిన పోలీసులు తనిఖీ చేయగా, సుమారు లక్ష డాలర్లు (రూ. 95 లక్షలు) విలువైన 170 స్మార్ట్‌ఫోన్లు బయటపడ్డాయి. దీంతో ఫోన్లను అక్రమంగా తరలిస్తున్న ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.