ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల గురక సమస్య పెరుగుతోందని, దీనిని ప్రశాంత నిద్రగా భావించడం పొరపాటని నిపుణులు సూచిస్తున్నారు. గాఢ నిద్రలో గురక పెట్టడం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరింస్తున్నారు. గురక వల్ల వాయుమార్గం కుంచించుకుపోయి, రక్తపోటు పెరిగి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి గుండెపై భారం పెరుగుతుందని చెబుతున్నారు.