గురక పురుషుల్లోనే ఎందుకు ఎక్కువ?

6087చూసినవారు
గురక పురుషుల్లోనే ఎందుకు ఎక్కువ?
రాత్రిపూట వచ్చే గురక శబ్దానికి వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య నిపుణుల ప్రకారం పురుషుల గొంతు సహజంగా ఇరుకైనది కావడం, హార్మోన్ల ప్రభావం, మెడ చుట్టూ కొవ్వు చేరడం వంటి కారణాల వల్ల పురుషుల్లో గురక ఎక్కువగా వస్తుంది. తేలికపాటి గురక స్లీప్ అప్నియాకు దారితీసి గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ప్రమాదాలకు కారణం కావచ్చు. బరువు తగ్గడం, ధూమపానం-మద్యపానానికి దూరంగా ఉండటం, పక్కకు తిరిగి పడుకోవడం వంటి చిట్కాలతో గురకను తగ్గించుకోవచ్చు. గురకతో పాటు ఆయాసం లేదా పగటిపూట నీరసం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్