ఫిబ్రవరి 1వ తేదీన 'మంచు చంద్రుడు' (Snow Moon) తన నిండు పున్నమి వెలుగులతో భూమిని పలకరించబోతున్నాడు. ఉత్తర అర్ధగోళంలో ఫిబ్రవరి నెలలో మంచు విపరీతంగా కురిసే సమయంలో వచ్చే ఈ పున్నమిని పురాతన తెగలు 'స్నో మూన్' అని పిలిచేవారు. ఈసారి వచ్చే పౌర్ణమికి 'మాఘ పూర్ణిమ' అనే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా తోడవ్వడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం సమయంలో చంద్రుడు మామూలు కంటే చాలా పెద్దదిగా కనిపిస్తాడు, దీనిని సైంటిస్టులు 'మూన్ ఇల్యూజన్' అని పిలుస్తారు.