సోషల్ మీడియా చిన్నారుల మెదళ్లను తొలుస్తోంది: అమితాబ్ కాంత్

3172చూసినవారు
సోషల్ మీడియా చిన్నారుల మెదళ్లను తొలుస్తోంది: అమితాబ్ కాంత్
సోషల్ మీడియా వాడకం చిన్నారుల మెదళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి ఆర్థిక సర్వే కూడా యువత సోషల్ మీడియా విపరీత వాడకంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డిజిటల్ వ్యసనం ఆర్థిక దుష్పరిణామాలకు దారితీస్తుందన్నారు. వయసుపరంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని అమితాబ్ కాంత్ అన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. సోషల్ మీడియా వాడకం ఉత్పాదకతను, ఏకాగ్రతను తగ్గిస్తుందని, దీర్ఘకాలంలో వాస్తవ ప్రపంచంలో కష్టపడి పనిచేయలేని తరం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్