కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకులకు కొత్త అనుభూతి

167చూసినవారు
కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకులకు కొత్త అనుభూతి
AP: కృష్ణానదిలో పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డీజిల్ బోట్లకు బదులుగా సోలార్ శక్తితో నడిచే మెకనైజ్డ్ బోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జరిగిన బోర్డు సమావేశంలో ప్రయోగాత్మకంగా నాలుగు సోలార్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ డివిజన్‌కు కేటాయించనున్న ఈ బోట్లు, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్