మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. 80 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకు భార్య ఒత్తిడితో నడిరోడ్డుపై వదిలివేసినట్లు సమాచారం. కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో రోడ్డుపై ఎదురుచూస్తున్న వృద్ధురాలిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి వృద్ధురాలిని రక్షించి, ఆమె కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.