ఎఫైర్.. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు మృతి

9039చూసినవారు
ఎఫైర్.. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు మృతి
TG: వివాహేతర సంబంధం ఓ అమాయకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్(D) పోచంపాడ్  వడ్డెర కాలనీకి చెందిన శ్రీకాంత్  కొంతకాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న మహిళ బావ నర్సింలు ఇంటికి మంగళవారం శ్రీకాంత్, అతడి బావ వేణు, అల్లుళ్లు రుతిక్, రిశిక్ వెళ్లారు. నర్సింలు కొడుకులు ఉదయ్, కిశోర్ పై కర్రలతో దాడి చేశారు. వారిని కాపాడే ప్రయత్నంలో నర్సింలు పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో శ్రీకాంత్ పై దాడి చేసేందుకు యత్నించగా, అతడి అల్లుడు రిశీక్  అడ్డుకున్నాడు. దీంతో అతడిపై కత్తి వేటు పడగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్