AP: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి భర్త వేధిస్తున్నాడని కుమార్తె తన తండ్రి నాగరాజుకు ఫిర్యాదు చేయడంతో, ఆయన అల్లుడు అవినాష్‌ను ప్రశ్నించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మామ, అల్లుడి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి గురైన అవినాష్ చెక్కపీటతో నాగరాజు తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.