అప్పు తిరిగివ్వమన్నాడని పిల్లనిచ్చిన మామనే చంపిన అల్లుడు

12402చూసినవారు
అప్పు తిరిగివ్వమన్నాడని పిల్లనిచ్చిన మామనే చంపిన అల్లుడు
AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో డబ్బు, పగ కారణంగా ఓ అల్లుడు తన మామను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అల్లుడికి రూ. 10 లక్షలు అప్పుగా ఇచ్చిన మామ శంకర్ నారాయణరెడ్డి, ఆ డబ్బులు తిరిగి రాకపోవడంతో పాటు కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో అల్లుడిపై కేసు పెట్టాడు. అనంతరం బయటకు వచ్చిన అల్లుడు, తన మామపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని, తన వద్ద పనిచేసే వ్యక్తితో కలిసి మామపై దాడి చేసి హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్