తల్లిని హత్య చేసిన కొడుకు.. ఆపై ఆత్మహత్య

2217చూసినవారు
తల్లిని హత్య చేసిన కొడుకు.. ఆపై ఆత్మహత్య
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం దారుణ ఘటనచోటుచేసుకుంది. భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మద్యానికి బానిసైన శ్రీనివాస్ (42) తన తల్లి పోశమ్మ (69)ను బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత, తాను చేసిన నేరానికి భయపడి, అదే రోజు ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు, భూవివాదాలు ఈ ఘటనకు దారితీసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్