ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సోనమ్ వాంగ్‌చుక్

9113చూసినవారు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్,  ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీల వల్ల 21 మంది మరణించారని ఆయన ఆరోపిస్తున్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం ఈ దీక్ష చేస్తున్నట్లు సోనమ్ తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా ఇదే డిమాండ్‌తో ఈ నెల 20 నుంచి నిరసనలు చేపట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా దీక్ష కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్