టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో స్టేజీపై అసభ్య పదజాలం ఉన్న పాట పాడటం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై తాజాగా దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాత చిన్ని స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. సినిమాలో తన పాత్ర గురించి చెప్పే ఉద్దేశ్యంతోనే చంద్రహాస్ ఆ పాట పాడాడని, అయితే నోరు జారడం ఊహించలేదని, అతను కావాలని చేయలేదని నిర్మాత చిన్ని తెలిపారు. ఈ విషయంపై తాము కూడా బాధపడుతున్నామని, చంద్రహాస్‌ను మందలించామని ఆయన పేర్కొన్నారు.