గంగూలీ బయోపిక్: పుట్టినరోజున ఫస్ట్ గ్లింప్స్, విడుదల తేదీ ప్రకటన?

10730చూసినవారు
గంగూలీ బయోపిక్: పుట్టినరోజున ఫస్ట్ గ్లింప్స్, విడుదల తేదీ ప్రకటన?
భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ' పై అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు గంగూలీ పాత్రలో నటించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. జూలై 8న గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గంగూలీ భారత క్రికెట్‌కు అందించిన సేవలు, నాయకత్వ లక్షణాలను ఈ సినిమా ఆవిష్కరించనుంది.

సంబంధిత పోస్ట్