విశాఖపట్నం కేంద్రంగా జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చరిత్రాత్మక మైలురాయి అని ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'ఎక్స్'లో పోస్టు పెట్టిన ఆయన, దశాబ్దాల కల నెరవేరుతోందని, నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందని, కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇదొక కీలక మైలురాయి కానుందని తెలిపారు.