AP: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో ఈ జోన్ దేశంలో 18వ రైల్వే జోన్‌గా అవతరించింది. వీఎంఆర్‌డీఏ డెక్ భవనంలో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు కొత్తగా విశాఖపట్నం డివిజన్ కూడా చేరింది. దీంతో 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ అధికారికంగా ముగిసింది.