పీఎం సూర్యఘర్ స్కీమ్ అమలుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి

43చూసినవారు
పీఎం సూర్యఘర్ స్కీమ్ అమలుపై ప్రత్యేక దృష్టి: మంత్రి గొట్టిపాటి
AP: పీఎం సూర్యఘర్ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను సూచించారు. మంగళవారం ఎస్పీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేయని వెండర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్