పర్యావరణ ప్రమాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: పవన్

28చూసినవారు
పర్యావరణ ప్రమాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: పవన్
AP: ఆక్వా వ్యర్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల నివారణపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రాసెసింగ్ యూనిట్లలో పర్యావరణ ప్రమాణాల అమలుపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల వల్ల నదులు, కాలువలు, భూగర్భ జలాల నాణ్యత దెబ్బతింటోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి.. కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్