రెబెల్ స్టార్
ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' చిత్రంపై అంచనాలున్నాయి. ఇటీవల వరకు నిరంతరాయంగా చిత్రీకరణలో సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక నెల విరామం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విరామం తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందని, సినిమా పనులు అద్భుతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.