తృణమూల్
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ రెండుగా చీలిపోయిందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేర్వేరుగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ధిక్కరిస్తూ, దాదాపు 19 మంది ఎంపీలు బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఢిల్లీలో సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.