నకిలీ మద్యం కేసు: జోగి రమేశ్‌ సహా నిందితుల రిమాండ్‌ పొడిగింపు

6946చూసినవారు
నకిలీ మద్యం కేసు: జోగి రమేశ్‌ సహా నిందితుల రిమాండ్‌ పొడిగింపు
విజయవాడ ఎక్సైజ్‌ కోర్టు నకిలీ మద్యం కేసులో నిందితుల రిమాండ్‌ను డిసెంబరు 9 వరకు పొడిగించింది. వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్‌, జోగి రాము, అద్దేపల్లి జనార్దన్‌రావుతో పాటు మరో నలుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా, ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసులో నిందితుల రిమాండ్‌ గడువు మంగళవారంతో ముగియడంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్