రాష్ట్రంలో కల్తీ మద్యం దుకాణాలు పెరిగిపోయాయి: జూపూడి (వీడియో)

11597చూసినవారు
AP: కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కల్తీ మద్యం దుకాణాలు పెరిగిపోయాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో సరఫరా అవుతున్న ప్రతి 3 మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ ఉంది. పరిశ్రమలు తెస్తామని చెప్పిన చంద్రబాబు.. కల్తీ మద్యం ఫ్యాక్టరీలను తెచ్చారు. చంద్రబాబు తెచ్చిన బ్రాండ్స్‌లోనే కల్తీ మద్యం పోస్తున్నారు’ అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్