Dec 16, 2025, 13:12 IST/డోర్నకల్
డోర్నకల్
డోర్నకల్, సీరోల్ మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ
Dec 16, 2025, 13:12 IST
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, సీరోల్ మండలాల్లో బుధవారం జరగనున్న ఎన్నికల కోసం అధికారులు మంగళవారం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. డోర్నకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల, సీరోల్ మండలంలోని హై స్కూల్లో బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సామగ్రి వివిధ గ్రామ పంచాయతీలకు చేరుకోనుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.