ఆత్మకూరులో విద్యా సంవత్సరం ప్రారంభం: 41 వేల మంది విద్యార్థుల హాజరు

260చూసినవారు
ఆత్మకూరులో విద్యా సంవత్సరం ప్రారంభం: 41 వేల మంది విద్యార్థుల హాజరు
ఆత్మకూరు డివిజన్‌లో నూతన విద్యా సంవత్సరం 9 మండలాల్లోని 534 ప్రభుత్వ, 69 ప్రైవేట్ పాఠశాలలతో సందడిగా ప్రారంభమైంది. సుమారు 41 వేల మంది విద్యార్థులు హాజరయ్యారని డిప్యూటీ డీఈఓ జానకిరామ్ తెలిపారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోధన కొనసాగించేలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎంతో సంతోషంగా పాఠశాలలకు వచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్