చేజర్ల: ఆ గ్రామంలో అభివృద్ధి శూన్యం

0చూసినవారు
చేజర్ల: ఆ గ్రామంలో అభివృద్ధి శూన్యం
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా చేజర్ల మండలంలోని మడపల్లి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోనే అతిపెద్ద గ్రామమైన మడపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు ఉన్నప్పటికీ, గ్రామంలో అభివృద్ధి శూన్యంగా ఉందని, కనీసం ప్రధాన రహదారి, వీధి దీపాల పరిస్థితి కూడా దారుణంగా ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం స్థానిక నాయకుల వైఫల్యమేనని వారు విమర్శిస్తున్నారు.