సర్వేపల్లిలో సీఎంఆర్ఎఫ్ సాయం రూ. 8. 14 కోట్లకు చేరిక

480చూసినవారు
సర్వేపల్లిలో సీఎంఆర్ఎఫ్ సాయం రూ. 8. 14 కోట్లకు చేరిక
నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు రూ. 39.53 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 882 మందికి మొత్తం రూ. 8.14 కోట్ల ఆర్థిక సాయం అందింది. అర్హులైన ప్రతి దరఖాస్తును పరిశీలించి సీఎం చంద్రబాబు ఉదారంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్