కలువాయి: స్కూల్ వ్యాన్ ఢీకొని ఒకరు మృతి

1933చూసినవారు
తోపుగుంట–కలువాయి రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పడమటి కంభంపాడు గ్రామానికి చెందిన ఉదయగిరి బాబు (35) మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్