ఆత్మకూరు మండలంలో రూ. లక్ష 21 వేలు పలికిన లడ్డు

2చూసినవారు
ఆత్మకూరు మండలంలో రూ. లక్ష 21 వేలు పలికిన లడ్డు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బోయల చిరువెళ్ల గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పడమటి విధి యూత్ ఆధ్వర్యంలో వినాయకుడిని మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వామివారి వద్ద ఉంచిన లడ్డూకు వేలం నిర్వహించగా పోటాపోటీగా సాగిన వేలం చివరకు రూ. లక్ష 21 వేల వద్ద ముగిసింది. ఆ గ్రామ రావూరు వెంకటకృష్ణ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో బాణాసంచాల మధ్య గణేశుని లడ్డుని అందజేశారు.

సంబంధిత పోస్ట్