మర్రిపాడు మండలం నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి ఢీకొన్న లారీ ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే, లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.