మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఆత్మకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం నెల్లూరులో కార్యక్రమాలు ముగించి, మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో P-4 ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2026-27 బడ్జెట్‌పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.