నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యానాది నాయుడు అకాల మరణం చెందడంతో, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం వారి నివాసానికి వెళ్లి, చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం యానాది నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఏఎంసి చైర్మన్ జనార్దన్ నాయుడు, శాఖమూరి నారాయణ, ఎం చంద్రబాబు, వీరారెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.