సైదాపురం మండలం ఎంఎస్ కాలనీకి చెందిన గిరిజన యువకులు సురేంద్ర, అశోక్ అదృశ్యమయ్యారు. రైల్వే కోడూరుకు చెందిన ఇటుక బట్టీల యజమాని ఎస్. వెంకటేశ్ వారిని కిడ్నాప్ చేసి ఉండవచ్చని బాధితుల కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కూలీ పని మానేసిన కక్షతోనే ఈ ఘటన జరిగిందని బాధితుల తల్లిదండ్రులు మల్లికా అంకయ్య, పద్మమ్మ సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.