ఆత్మకూరుకు చెందిన భవిష్య అనే బాలిక తల్లితో కలిసి నెల్లూరు వెళ్లి తిరిగి వస్తూ బస్టాండ్‌లో పొరపాటున బద్వేల్ బస్సు ఎక్కింది. తల్లి ఆందోళన చెందగా, ప్రయాణికులు 112కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై జంపాని కుమార్ సిబ్బందితో కలిసి నెల్లూరు పాలెం వద్ద బాలికను గుర్తించి, సురక్షితంగా సంరక్షించారు. బాలిక వివరాలు సేకరించి, మేధా పాఠశాల ద్వారా తల్లిదండ్రులను గుర్తించి, బాలికను వారికి అప్పగించారు.