ఆదురుపల్లిలో సీతారామ లక్ష్మణుల ఊరేగింపు ఘనంగా నిర్వహణ

444చూసినవారు
చేజర్ల మండలం ఆదురుపల్లిలో బుధవారం రాత్రి సీతారాముల కళ్యాణం అనంతరం, గురువారం ఉదయం సీతారామ లక్ష్మణుల ఊరేగింపు ఘనంగా జరిగింది. డప్పులు, మేళతాళాల నడుమ స్వామివారిని ట్రాక్టర్‌పై గ్రామ వీధులలో తీసుకెళ్లగా, గ్రామస్థులు బాణసంచా కాల్చుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్