సోమశిల: ప్రస్తుతం సోమశిల లో 71. 097 టీఎంసీల నీటి మట్టం

59చూసినవారు
సోమశిల: ప్రస్తుతం సోమశిల లో 71. 097 టీఎంసీల నీటి మట్టం
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా శుక్రవారం నాటికి జలాశయంలో 71. 097 టిఎంసిల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1931 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. పైనా డెల్టాకు 2000, కండలేరుకు 550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం పడే సూచన కనిపించింది. ఒకవేళ వర్షం పడితే వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్