నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల బెట్టింగ్‌పై కఠిన హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్ వ్యసనం జీవితాలను అంధకారంలోకి నెడుతుందని పేర్కొన్నారు. ఈ నెల 3న అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించి రూ. 1. 65 కోట్లు వెలికితీసి, రూ. 89 లక్షలు సీజ్ చేసి, రూ. 35 లక్షలు రికవరీ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. గతంలో బెట్టింగ్‌లో ఉన్నవారికి కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఆన్‌లైన్ యాప్‌లు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న బెట్టింగ్‌పై నిఘా పెంచినట్లు తెలిపారు.