కలువాయి మండలం దాచూరు గ్రామంలో ఆదివారం దోమల నిర్మూలనకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు దాచూరు సర్పంచ్ రాజుల అనురాధ శ్రీనివాసులు రెడ్డి చర్యలు చేపట్టారు. రాత్రి సమయాలలో దోమలు అధికంగా ఉండటంతో మనుషులతో పాటు మూగ జీవాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో గ్రామంలోని అన్ని వీధుల్లో స్ప్రే చల్లించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉండేలా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.