పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం: మంత్రి ఆనం

260చూసినవారు
పార్లమెంట్ సాక్షిగా తెలుగు వారి కల సాకారం: మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోందని, తెలుగు ప్రజల ఏళ్ల నాటి కల, ఆశయం నెరవేరబోతోందని తెలిపారు. భారత పార్లమెంట్ వేదికగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అధికారికంగా ఆమోదం పొందనుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూ, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని విషయంలో ‘మూడు ముక్కలాట’ ఆడి ప్రజలను వంచించారని, జగన్ హయాంలో జరిగిన దుర్మార్గాల నుంచి, అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని రక్షించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్