సంగం మండలంలో విషాదం.. కరెంట్ షాక్‌తో 5 గేదెల మృతి

228చూసినవారు
సంగం మండలంలో విషాదం.. కరెంట్ షాక్‌తో 5 గేదెల మృతి
శనివారం సంగం మండలం వంగల్లు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను పట్టించుకోకుండా గేదెలను మేపుతుండగా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో 5 గేదెలు కరెంట్ షాక్‌తో మృతి చెందాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, స్థానికుల అప్రమత్తత లోపమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్