నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 10వ తరగతి విద్యార్థి కుశాంత్ సోమశిల ఉత్తర కాలవలో పడి మృతి చెందాడు. ఎల్లుండి పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.