
కందుకూరు: TRR డిగ్రీ కళాశాలలో NCC పునరుద్ధరణకు కృషి
కందుకూరులోని TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NCC యూనిట్‌ను పునరుద్ధరించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 1964 నుంచి కొనసాగిన ఈ విభాగం, ANO లేమితో 2023లో నిలిచిపోయింది. NCC విద్యార్థుల క్రమశిక్షణ, కెరీర్ అవకాశాలను మెరుగుపరుస్తుందని ఎంపీ తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.








































