కందుకూరు శివారులో మంగళవారం రాత్రి సింగరాయకొండ రోడ్డులోని వాసవి నగర్ కాలనీ సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్‌తో పాటు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.