కందుకూరులో జనవరి కల్లా క్రికెట్ గ్రౌండ్ – ఎమ్మెల్యే

399చూసినవారు
కందుకూరులో జనవరి కల్లా క్రికెట్ గ్రౌండ్ – ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పడమటి బలిజపాలెం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నీలో 28 జట్లు పాల్గొనగా, ఛాంపియన్స్ లెవెల్ జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు రూ. 55,516, రన్నరప్‌లకు రూ. 35,116 నగదు బహుమతులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్