గుడ్లూరు: గ్రూప్-2 పరీక్షల్లో సత్తా చాటిన ఆమోస్

627చూసినవారు
గుడ్లూరు: గ్రూప్-2 పరీక్షల్లో సత్తా చాటిన ఆమోస్
గుడ్లూరు మండలం మోచర్ల గ్రామానికి చెందిన దారా ఆమోస్, పట్టుదలతో గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణుడై, ఏపీ సెక్రెటేరియేట్‌లో ASOగా ఎంపికయ్యాడు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో కూలి పనులు చేసే తల్లిదండ్రుల కష్టం ఫలించిందని గ్రామస్థులు తెలిపారు. వారి బిడ్డ భవిష్యత్తు కోసం వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందని మోచర్ల వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్