గుడ్లూరు: మూర్తింపేట జెట్టీ నిర్మాణానికి శ్రీకారం

405చూసినవారు
గుడ్లూరు: మూర్తింపేట జెట్టీ నిర్మాణానికి శ్రీకారం
గుడ్లూరు మండలం మూర్తింపేట వద్ద రూ. 28 కోట్లతో నిర్మించనున్న జెట్టీకి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 4.69 ఎకరాల్లో 328 అడుగుల పొడవుతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ జెట్టీ వల్ల మత్స్యకారులకు పడవ రాకపోకలు సులభమై జీవనోపాధి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు న్యాయం చేశామని, త్వరలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్